ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ నమోదు

ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ నమోదు

న్యూఢిల్లీఢిల్లీలో ఎండలు మండిపోతున్నయి.. సోమవారం ఏకంగా రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జూన్​నెలలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికమని అధికారులు చెప్పారు. ఆల్​టైం రికార్డు ఉష్ణోగ్రత 48.4 డిగ్రీలు.. 1998లో మే 26న పాలం అబ్జర్వేటరీ ఈ టెంపరేచర్​ను నమోదు చేసిందని ఐఎండీ ఏడీజీ దేవేంద్ర ప్రధాన్​చెప్పారు. ఉత్తర భారతం మీదుగా వీస్తున్న వడగాలుల కారణంగా ఉష్ణోగ్రత ఈ స్థాయిలో పెరిగిందన్నారు. రిడ్జ్, అయనగర్, లోధి రోడ్​లో వరుసగా 47.9, 47, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అన్నారు. నగరవ్యాప్తంగా వేడి గాలులు వీచాయని, మరో 24 గంటల పాటు గాలులు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. నైరుతి గాలుల కారణంగా మంగళవారం ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు తగ్గుతాయని చెప్పారు. కాగా, రాజస్థాన్​లోని ధోల్పూర్​లో  51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఈ సీజన్​లో కెల్లా అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ తెలిపింది.