ఈశ్వరుడి దయతో కోలుకున్నా: అమిత్ షా

ఈశ్వరుడి దయతో కోలుకున్నా: అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఇవాళ(శుక్రవారం) జరిపిన కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఈశ్వరుడి దయ వల్లే కరోనా నుంచి బయటపడ్డానంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా నుంచి తాను కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెపుతున్నానని తెలిపారు. డాక్టర్లు తనను మరి కొన్ని రోజులు హోం ఐసొలేషన్ లో ఉండమని చెప్పారని..వారి సలహాలను పాటిస్తానంటూ ఉంటానని చెప్పారు. తనకు చికిత్స అందించిన మేదాంత ఆసుపత్రి డాక్టర్లకు, ప్యారా మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు చెపుతున్నానని ట్వీట్ చేశారు. 55 ఏళ్ల అమిత్ షా ఈ నెల 2 వ తేదీన కరోనా బారిన పడ్డారు.