హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రెడ్‌‌‌‌‌‌‌‌ బుల్ సోప్‌‌‌‌‌‌‌‌బాక్స్‌‌‌‌‌‌‌‌ రేస్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రెడ్‌‌‌‌‌‌‌‌ బుల్ సోప్‌‌‌‌‌‌‌‌బాక్స్‌‌‌‌‌‌‌‌ రేస్

 హైదరాబాద్:  ప్రపంచంలోనే అత్యంత  వినోదభరితమైన  నాన్ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసింగ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌గా పేరొందిన  రెడ్ బుల్ సోప్‌‌‌‌‌‌‌‌బాక్స్ రేస్  మూడో ఎడిషన్‌‌‌‌‌‌‌‌  హైదరాబాద్ వేదికగా  జరగనుంది. మార్చి 3న ఫిల్మ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని  రామానాయుడు స్టూడియోస్ లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ రేస్ జరగనుంది. ఈ రేసులో పాల్గొనేందుకు 23 రాష్ట్రాల నుంచి 3,300 రిజిస్ట్రేషన్లు రాగా, షార్ట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్ చేసిన 30 జట్లకు చెందిన కాట్స్‌‌‌‌‌‌‌‌ రామానాయుడు స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో పరుగులు పెట్టనున్నాయి. 

ఈ వాహనాలకు ఇంజన్ ఉండదు. చక్రాలు,  బ్రేకులు, స్టీరింగ్ మాత్రమే ఉంటాయి. కేవలం గురుత్వాకర్షణతో  ఏటవాలు నుంచి పల్లానికి ఉన్న రోడ్డుపై సృష్టించిన వివిధ అడ్డంకులను దాటుకుంటూ ముందుకెళ్తాయి. రేస్‌‌‌‌‌‌‌‌ టైమింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు మొత్తం ఈవెంట్ లో ఆ జట్టు పెర్ఫామెన్స్​ ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. జియో టీవీలో రేస్ లైవ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.