ఎర్ర చందనం ఇక చట్టబద్ధం.. సాగు చేసి అమ్ముకోవచ్చు

ఎర్ర చందనం ఇక చట్టబద్ధం.. సాగు చేసి అమ్ముకోవచ్చు

అంతర్జాతీయ మార్కెట్లో  ఎర్రచందనానికి ఉన్న డిమాండ్ ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంట.  అత్యంత విలువైన ఎర్రచందనం సాగు చేయడం ఇప్పటి వరకు చట్టవిరుద్ధం ఎందుకంటే  నిషేదిత జాబితాలో ఉండటమే కారణం. అయితే  ఎర్రచందనం సాగు, ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగించింది.  ఈ మేరకు కేంద్రమంంత్రి భూపేందర్ యాదవ్  ప్రకటన చేశారు.

 ప్రభుత్వం  ఎర్రచందనం సాగును సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ (Review of  Significant Trade) నుంచి తొలగించినట్లు చెప్పారు. సాగు చేసి, ఎగుమతి  చేసుకోవచ్చని..అంతేగాకుండా సాగుకు ప్రోత్సహాలు కూడా ఇస్తామని తెలిపారు.  ఇటీవల స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన కన్వెన్షన్   ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

 ఎర్రచందనం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలోని శేషాచలం అడవి ప్రాంతంలో దొరుకుతుంది. చిత్తూరు,నెల్లూరు,కడప ,కర్నూలు జిల్లాలోని శేషచలం, వెలుగొండ, పాలకొండ, నల్లమల అడవులు తూర్పుకనుమల్లో వరకు విస్తరించి ఉన్నాయి.  ఎక్కువగా శేషాచలం,  వెలుగొండల్లో మాత్రమే  ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది.  ఇక్కడ పెరిగే ఎర్రచందనానికి ఔదగుణాలతో పాటు  మంచి రంగు నాణ్యత ఉంటుంది.