షావోమీ హైదరాబాద్‌లో శుక్రవారం (డిసెంబర్ 06) రెడ్మీ 15సీ స్మార్ట్‌ఫోన్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.74 అంగుళాల డిస్‌ప్లే, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్, ఫాస్ట్ చార్జింగ్ దీని ప్రత్యేకతలు.
దీనికి రెండేళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇస్తారు. ఈ కొత్త మోడల్ 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ.11,500 నుంచి రూ.15,500 వరకు ఉంటాయి. డిసెంబర్ 11 నుంచి అమెజాన్, ఎంఐ ఆన్లైన్ స్టోర్, రిటైల్ స్టోర్లలో అమ్మకాలు మొదలవుతాయి.
