V6 News

అయ్యో పాపం: కబళించిన లారీ.. తెగిపడ్డ కాళ్లు.. హైదరాబాద్ లో ఘటన

అయ్యో పాపం: కబళించిన లారీ.. తెగిపడ్డ కాళ్లు.. హైదరాబాద్ లో ఘటన

జీడిమెట్ల, వెలుగు: కాసేపట్లో ఇంటికి వెళ్తాననుకున్న ఓ వ్యక్తిని రెడిమిక్స్ లారీ జీవితాంతంలో కోలుకోలేని దెబ్బ తీసింది. కళ్లముందే రెండు కాళ్లు తెగిపడడంతో బాధితుడు నరకయాతన అనుభవించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్​కు చెందిన అశోక్ చారి (45) ఎంఆర్ఎల్ఐటీ కాలేజీలో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కాలేజీ పని ముగించుకుని తన బైక్​పై ఇంటికి బయలుదేరారు. 

దుండిగల్​లోని డబుల్ బెడ్​రూమ్ ఇండ్ల వద్దకు రాగానే, ఓ రెడిమిక్స్ లారీ డ్రైవర్ అతివేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో అశోక్ కింద పడిపోగా, లారీ టైరు ఆయన కాళ్లపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆయన రెండు కాళ్లు అక్కడికక్కడే నుజ్జునుజ్జయ్యి తెగిపోవడంతో నరకయాతన అనుభవించారు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.