బైక్ ను ఢీకొట్టి.. లోయలో పడిన ఎర్రచందనం తరలిస్తున్న వాహనం .. స్మగర్లు పరారీ ..

బైక్ ను ఢీకొట్టి..  లోయలో పడిన ఎర్రచందనం తరలిస్తున్న వాహనం .. స్మగర్లు పరారీ ..

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పలమనేరు చిత్తూరు జాతీయ రహదారిపై  కాటప్పగారిపల్లె రోడ్డు సమీపంలో  ఎర్రచందనం తరలిస్తున్న వాహనం (కారు)(KA05MD4456)   ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి పల్టీలు కొట్టి లోయలో పడింది.   

 డివైడర్​ను  ఢీ కొట్టి రోడ్డు అటు వైపునకు దూసుకెళ్లడంతో కొరివారిపల్లి నుండి బంగారుపాళ్యం వైపు ద్విచక్రవాహనంపై వెళుతున్న వెంకటస్వామిను ఢీకొనడంతో అతనికి గాయాలయ్యాయి.   కారు రోడ్డుపక్కన పడటంతో ఎర్రచందనం స్మగ్లర్లు పరారయ్యారు. 

సంఘటన స్థలానికి చేరుకున్న బంగారుపాళ్యం పోలీసులు ద్విచక్ర వాహనాన్ని, కారు, కారులో ఉన్న 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుల ఆచూకీ కోసం  గాలిస్తున్నారు.