జూరాలకు తగ్గిన వరద

జూరాలకు తగ్గిన వరద

నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
గద్వాల/శ్రీశైలం, వెలుగు:
జూరాల ప్రాజెక్టుకు సోమవారం వరద ఉధృతి తగ్గింది. దీంతో జూరాల హైడల్ ప్రాజెక్టు దగ్గర అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నుంచి రెండు, మూడు రోజులుగా వరద వస్తున్నది. సోమవారం భీమా నది నుంచి వరద తగ్గింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 327.40 లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని, భీమా లిఫ్ట్-1కి 1,300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కి 750  క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్​కు 1,500 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్​కి  820 క్యూసెక్కులు, ప్యారలల్ కెనాల్​కి 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా.. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద తగ్గిపోయింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 29,204 టీఎంసీల ఇన్​ఫ్లో నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇన్​ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 811.40 అడుగుల మేరు నీరు ఉండగా, 35.1275 టీఎంసీల నీరు నిల్వ ఉంది.