వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తగ్గిన ఇంటి కిరాయిలు

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తగ్గిన ఇంటి కిరాయిలు

బెంగళూరు: ఉద్యోగాల కోత, వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌తో రెసిడెన్షియల్ రెంటల్స్ బాగా దెబ్బతిన్నాయి. మేజర్ మార్కెట్లలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ రెంటల్స్ తగ్గినట్టు ప్రాపర్టీ బ్రోకర్స్ చెబుతున్నారు. కరోనాతో యంగ్ ప్రొఫెషనల్స్ అద్దె ఇళ్లను, పేయింగ్ గెస్ట్ అకామడేషన్లను బాగా ఖాళీ చేశారని పేర్కొన్నారు. కరోనాతో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఆఫర్ చేయడం దానికి తోడు ఉద్యోగాలు పోవడం, వేతనాల కోత వంటివన్నీ రెంటల్ ప్రాపర్టీ సెగ్మెంట్‌కు ప్రతికూలంగా నిలిచినట్టు చెప్పారు.  ప్రాపర్టీ బ్రోకర్స్, బ్రోకింగ్ సంస్థల ప్రకారం ముంబై, చెన్నై, పుణే, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌‌లలో రెంటల్స్ ఈ ఏడాది 4–5 శాతం వరకు తగ్గిపోయాయి.  రెంటల్ అకామడేషన్లకు డిమాండ్ కూడా ఈ ఏడాది కనీసం 25 శాతం తగ్గింది. కరోనా అవుట్‌బ్రేక్‌ రెంటల్ రెసిడెన్షియల్ మార్కెట్‌ను దెబ్బతీసినట్టు మ్యాజిక్ ‌బ్రిక్స్ చెప్పింది.

For More News..

ఆసీస్ సిరీస్‌ నుంచి షమీ ఔట్‌!

16 ఏండ్ల బాలికతో క్షుద్రపూజలు?

దండకారణ్యంలో ఓపెన్​ క్లబ్బులు.. అక్కడ కోడి పంచాంగం స్పెషల్