తగ్గిన ఎల్పీజీ, ఏటీఎఫ్​ ధరలు

తగ్గిన ఎల్పీజీ, ఏటీఎఫ్​ ధరలు

న్యూఢిల్లీ : విమానాల్లో వాడే జెట్ ఇంధనం (ఏటీఎఫ్)​ ధర స్వల్పంగా తగ్గింది. హోటళ్లు,  రెస్టారెంట్లు వంటి సంస్థలు ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ రేట్లు తగ్గాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సిలిండర్‌‌పై రూ.31 తగ్గింది.   ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్​) ధర కిలోలీటర్‌‌కు రూ. 502.91 లేదా 0.49 శాతం దిగొచ్చింది. దేశ రాజధానిలో కిలో లీటర్‌‌కు రూ. 1,00,893.63కి తగ్గింది.  

స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.   19 కిలోల వాణిజ్య ఎల్పీజీ ధరను రూ. 30.5 తగ్గించడంతో ధర రూ. 1,764.50లకు దిగివచ్చింది. ఇంటి అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్‌‌ ధర యథాతథంగా రూ. 803 వద్దే ఉంది. ఈ ఏడాది జనవరి తర్వాత వాణిజ్య ఎల్‌‌పీజీ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. ఐదు కిలోల ఎఫ్‌‌టిఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ ధర రూ.7.50 తగ్గింది.