తగ్గిన పెట్రోల్ ధరలు

తగ్గిన పెట్రోల్ ధరలు

దాదాపు మూడు వారాలపాటు స్థిరంగా కొనసాగిన పెట్రో రేట్లు ఇవాళ(బుధవారం) స్వల్పంగా తగ్గాయి. గత నెల 27న చివరి సారి ఢిల్లీలో ఆల్‌ టైమ్ గరిష్ఠ స్థాయికి పెట్రో ధరలు చేరుకున్నాయి. పెట్రోలు ధర లీటర్‌కు రూ. 91.17కు చేరుకుంది. లేటెస్టుగా  బుధవారం లీటరు పెట్రోలుపై 18 పైసలు తగ్గింది. దీంతో దేశ రాజధానిలో లీటరు రూ.90.99కి దిగొచ్చింది. డీజిల్‌పై 17 పైసలు తగ్గింది. ఫలితంగా ఇప్పుడు లీటర్ పెట్రోలు ధర రూ.81.30కు చేరుకుంది.

ప్రస్తుత తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 94.61గా ఉండగా, డీజిల్ ధర రూ. 88.67గా ఉంది. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ.97.40, రూ.88.42గా ఉండగా, చెన్నైలో రూ.92.95, రూ.86.29గా, కోల్‌కతాలో రూ.91.18, రూ.84.14గా ఉంది.