- ఎస్‌యూవీలకు పెరిగిన క్రేజ్
- వెల్లడించిన స్మిట్టెన్ పల్స్ స్టడీ
ముంబై: కార్లపై జీఎస్టీ తగ్గడంతో చాలా మంది కస్టమర్లు అప్‌గ్రెడేషన్‌కు మొగ్గుచూపుతున్నారు. బేస్ మోడల్‌కు బదులు మరింత ధర గల కారును కొంటున్నారని తాజా స్టడీ వెల్లడించింది. కొనుగోలుదారులలో దాదాపు 80 శాతం మంది ఈ పన్ను తగ్గింపు మొత్తాన్ని టాప్/ప్రీమియం మోడల్‌ను కొనడానికి ఉపయోగించుకున్నామని చెప్పారు. కన్స్యూమర్- ఇంటెలిజెన్స్ మార్కెట్- రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ స్మిట్టెన్‌పల్స్ ఏఐ ఈ స్టడీ కోసం టైర్ 1, 2 3 నగరాల్లోని 5,000 మంది నుంచి వివరాలను సేకరించింది.
దీని ప్రకారం, ఎక్కువ మంది స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) కొనుగోలుకు ఆసక్తి చూపారు. చార్జింగ్ సమస్యలు ఉన్నప్పటికీ, పర్యావరణ స్పృహ కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)పైనా ఆసక్తి బాగా పెరిగింది. 60 శాతానికి పైగా మంది ఒకే బ్రాండ్‌లో హైఎండ్ వేరియంట్లకు అప్‌గ్రేడ్ కావాలని కోరుకుంటున్నారు. 46 శాతం మంది ఇప్పటికే హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ఎస్‌యూవీల వంటి పెద్ద కేటగిరీకి మారారు.
కొత్తగా కారును కొనాలను వారిలోనూ మెజారిటీ కస్టమర్లు ఎస్‌యూవీలను ఇష్టపడుతున్నారు. బ్యాటరీ సమస్యలు, ఎక్కువ ధర ఉన్నప్పటికీ, 67 శాతం మంది రెస్పాండెంట్లు కాలుష్యాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఎలక్ట్రిక్ వెహికల్స్వైపు మళ్లుతున్నారు. దీంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. జీఎస్టీతో ఆదా అయిన డబ్బును ఎక్కువ డౌన్పేమెంట్చేయడానికి, ఎక్కువ లోన్తీసుకోవడానికి వాడామని 53 శాతం మంది కొనుగోలుదారులు చెప్పారు. వీరిలో మధ్యతరగతి వాళ్లే ఎక్కువని రిపోర్ట్ తెలిపింది.
