కాంగ్రెస్ నేతలవి అసత్య ఆరోపణలు : రేగా కాంతారావు

కాంగ్రెస్ నేతలవి అసత్య ఆరోపణలు : రేగా కాంతారావు

కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే రేగా కాంతారావు. “మమ్ములను బదనం చేస్తున్నారు. అద్భుత పాలన అందిస్తున్న కేసీఆర్ తో నడవాలని అనుకుంటున్నాం అని లేఖలో తెలిపాము. గిరిజనుల, ఆదివాసుల సమస్యలు పరిష్కారం చేస్తామని సీఎం  స్వయంగా హామీ ఇచ్చారు.అందుకే పార్టీ మారినం.  లేఖ లోనే చెప్పాము.. మేము పార్టీ కండువా కప్పుకుంటే MLA కు రాజీనామా చేస్తాము.  సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు.  ఎన్నికల ముందు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డిని ఎందుకు కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.  ఆదివాసులని మీరు మాఇళ్ల ముందు ధర్నా చేస్తాను అని అన్నారు ..అగ్రకులాల నాయకులు పార్టీ మారినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు.

రాష్ట్ర ప్రజలు  అభివృద్ధి కాంగ్రెస్ వల్లకాదు అని  TRSకు పట్టంకట్టారు. 16 మందిలో 4 గ్రూప్ లు ఉన్నాయి. మా ఆత్మ గౌరవం దెబ్బ  తీసేలా చేస్తే చూస్తూ ఉరుకోము. కాంగ్రెస్ MLC కి ఓట్ వేయండి..  50 లక్షలు ఇస్తామన్నారు. పార్టీ  ఓటమిపై ముందు సమీక్షలు చేసుకోండి. MLA లకు కూడా రాజీనామా చేస్తాము.

ఆదివాసీ MLA లపై అభాండాలు- ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆదివాసుల సమస్యలు పరిష్కారం చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు ఎమ్మెల్యే ఆత్రం సక్కు. ఆదివాసీ MLA లపై అభాండాలు చేశారు. ధర్నాలకు రండి చూసుకుందాం. SCలు, ఆదివాసులు అంటే కాంగ్రెస్ పార్టీలో చిన్నచూపు చూస్తున్నారు.