న్యాక్ గ్రేడ్ మెరుగుపరిచేందుకు కృషి : యాదగిరి

న్యాక్ గ్రేడ్ మెరుగుపరిచేందుకు కృషి : యాదగిరి

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ న్యాక్ గ్రేడ్ ని మెరుగుపరిచేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని రిజిస్ట్రార్ యాదగిరి కోరారు. వీసీ వాకాటి కరుణ ఆదేశాల మేరకు గురువారం ఆయన టీయూలో సిబ్బందితో న్యాక్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావాలంటే న్యాక్ అక్రిడిటేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, బోధన సిబ్బంది, పరిశోధనలకు అవసరమైన ప్రాజెక్టుల నిర్వహణ, ల్యాబ్ ల ఏర్పాటు తదితర వాటికి సైతం న్యాక్​గుర్తింపు ఉండాలన్నారు. న్యాక్ గుర్తింపు కోసం ఏక్యూఏఆర్ ను ఎలా సిద్ధం చేయాలో ప్రొఫెసర్స్ తో చర్చించి, అందులోని ఏడు ప్రమాణాల బాధ్యతను ఒక్కో ప్రొఫెసర్ కు అప్పగించారు.