
హైదరాబాద్, వెలుగు: హాస్పిటళ్ల మాదిరిగా హైదరాబాద్జిల్లాలోని ఆయుష్క్లినిక్స్, పాలి క్లినిక్స్, అల్లోపతి క్లినిక్స్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవసరమని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి స్పష్టం చేశారు. చేసుకోకుంటే క్లినికల్ఎస్టాబ్లిష్మెంట్చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి క్లినిక్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఆఫీసులో రిజిస్ట్రేషన్చేయించుకోవాలని తెలిపారు. సర్టిఫికెట్లతో అప్లికేషన్చేసుకుంటే 10 రోజుల్లో టెంపరరీ సర్టిఫికెట్ జారీ చేస్తామని, అంతా ఓకే అయితే 45 రోజుల్లో పర్మినెంట్(5 ఏండ్లకు) సర్టిఫికెట్జారీ చేస్తామని స్పష్టం చేశారు.