త్వరలో రీగ్రీన్​ ఎక్సెల్ ఐపీఓ

త్వరలో రీగ్రీన్​ ఎక్సెల్ ఐపీఓ

న్యూఢిల్లీ: ఇథనాల్ ప్లాంట్ల తయారీ సంస్థ రీగ్రీన్ -ఎక్సెల్ ఈపీసీ ఇండియా లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులను సేకరించేందుకు క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ వద్ద ప్రాథమిక పత్రాలను సబ్మిట్ చేసింది. 

ఫ్రెష్‌‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా  రూ. 350 కోట్లను సేకరించాలని చూస్తోంది. ప్రమోటర్లు 1.14 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్- ఫర్- సేల్ కింద అమ్మనున్నారు.  కంపెనీ తాజా ఇష్యూ ద్వారా వచ్చిన నికర ఆదాయాన్ని రుణ చెల్లింపు కోసం, బ్యాంక్ గ్యారెంటీలను పొందే ఉద్దేశంతో మార్జిన్ మనీ అవసరాలకు నిధులు సమకూర్చడానికి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాడుతుంది. 

 రీగ్రీన్​ఎక్సెల్ ఇథనాల్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల రూపకల్పన, తయారీ,  సరఫరా చేస్తుంది.  

మరిన్ని వార్తలు