యూఎస్‌‌‌‌లో మూతపడ్డ మరో బ్యాంక్

యూఎస్‌‌‌‌లో మూతపడ్డ మరో బ్యాంక్

న్యూఢిల్లీ: యూఎస్‌‌‌‌లో మరో బ్యాంక్ అఫీషియల్‌‌‌‌గా మూతపడింది. ఫస్ట్  రిపబ్లిక్ బ్యాంక్‌‌‌‌ను జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్ కొనుగోలు చేసింది. ఫస్ట్ రిపబ్లిక్‌‌‌‌  ఆస్తులు, డిపాజిట్లు ఈ బ్యాంక్‌ చేతికి వెళతాయని  ఫెడరల్ డిపాజిట్ఇన్సూరెన్స్ కార్ప్ (ఎఫ్‌‌‌‌డీఐసీ) పేర్కొంది. దీంతో యూఎస్‌‌‌‌లోని 10 శాతం కంటే ఎక్కువ డిపాజిట్లు ఒక్క బ్యాంక్‌‌‌‌ కంట్రోల్‌లోకే రానున్నాయి. ఫస్ట్ రిపబ్లిక్‌‌‌‌ను కొనడంతో  జేపీ మోర్గాన్ దగ్గర డిపాజిట్లు 2 ట్రిలియన్ డాలర్లు దాటేస్తాయి. ఎఫ్‌‌‌‌డీఐసీ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌‌‌‌ను సోమవారం   క్లోజ్ చేసింది.

ప్రస్తుతం ఈ బ్యాంక్‌‌‌‌కు ఎనిమిది యూఎస్‌ రాష్ట్రాల్లో 84 బ్రాంచులు ఉన్నాయి.  ఈ బ్రాంచులు జేపీ మోర్గాన్ బ్రాండ్ కింద ఓపెన్ అవుతాయి. యూఎస్ స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందే  పరిష్కారం వెతికేందుకు రెగ్యులేటరీ వీకెండ్‌‌‌‌లో పని చేసిందని చెప్పాలి. ఫస్ట్ రిపబ్లిక్‌‌‌‌ను టేకోవర్ చేయడానికి ఇతరులతో పాటు మమల్నీ ప్రభుత్వం ఆహ్వానించిందని జేపీ మోర్గాన్ చేజ్‌‌‌‌ సీఈఓ జేమీ డిమన్ పేర్కొన్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 13  నాటికి, ఫస్ట్ రిపబ్లిక్‌‌‌‌కు 229 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు, 104 బిలియన్ డాలర్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయి.