
హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీస్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ షూటింగ్ ఫిబ్రవరి మూడో వారంలో మొదలైంది. జెట్ స్పీడుతో షూటింగ్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ రివీల్ చేయకముందే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. జులై 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు శుక్రవారం నిర్మాతలు ప్రకటించారు. మరికొన్ని క్రేజీ అప్‌డేట్స్‌ను త్వరలోనే రివీల్ చేస్తామన్నారు. సముద్రఖని తమిళంలో తీసిన ‘వినోదయ సిత్తం’ అనే చిత్రానికి ఇది రీమేక్. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్‌తో పాటు బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న పవన్.. మరోవైపు హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ డైరెక్షన్‌లో ‘ఓజి’ సినిమాలు చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ వచ్చే నెలలో విడుదల కానుంది.