పీఆర్ కాంట్రాక్టర్లకు 182 కోట్ల బిల్లుల విడుదల

పీఆర్ కాంట్రాక్టర్లకు 182 కోట్ల బిల్లుల విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై)  రోడ్ల పనులు వేగవంతం కానున్నాయి.2022 సెప్టెంబర్  నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లులను కాంట్రాక్టర్లకు అధికారులు రిలీజ్ చేస్తున్నారు. ఈ స్కీమ్ లో 60 శాతం కేంద్ర వాటా కాగా 40 శాతం స్టేట్ షేర్ ఉంటుంది. మొత్తం రూ.182 కోట్లు రిలీజ్ కాగా ఇందులో కేంద్ర వాటా రూ.107 కోట్లు ( 60శాతం ), రాష్ర్ట వాటా రూ.75 కోట్లు ( 40 శాతం) ఉన్నాయి. తాజాగా స్టేట్ షేర్ ను రిలీజ్ చేయాలని ఫైనాన్స్ అధికారులను సీఎం ఆదేశించారు.

దీంతో నిధులు విడుదల అయ్యాయి. గత 5 రోజుల నుంచి కాంట్రాక్టర్లకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. ఏడాదిన్నర నుంచి పెండింగ్ బిల్స్ 85 శాతం క్లియర్ అయ్యాయని, సుమారు వెయి కోట్ల పీఎంజీఎస్ వై పనులు స్టార్ట్ చేస్తామని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కకు కాంట్రాక్టర్ల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.