టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై గైడ్ లైన్స్ రిలీజ్

టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై గైడ్ లైన్స్ రిలీజ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని టీచర్ల బదిలీలకు సంబంధించిన జీవో నెం. 5 ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ  జారీ చేశారు. అయితే టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభమవుతుందని వాకాటి అరుణ ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తులను ఆన్ లైన్ ఈ నెల 28 నుంచి 30 వరకు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. కాగా ఈ నెల 27 నుంచి మార్చి 4వ తేదీ దాకా 37 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇంతకు మునుపే ప్రకటించారు.

 • దరఖాస్తుల హార్డ్​కాపీలను హైస్కూల్ టీచర్లు సంబంధిత హెడ్మాస్టర్లకు.. గవర్నమెంట్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్లు సంబంధిత ఎంఈఓలకు.. మండల పరిషత్ ప్రైమరీ, యూపీఎస్ టీచర్లు సంబంధిత కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు.. హైస్కూల్ హెడ్మాస్టర్లు డీఈఓలకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 దాకా అందించాలి.
 • ఫిబ్రవరి 3 నుంచి 6 దాకా అప్లికేషన్ల హార్డ్ కాపీలను సంబంధిత హెడ్మాస్టర్లు, ఎంఈఓలు డీఈఓ ఆఫీసులో సమర్పిస్తారు. వాటి పరిశీలన, ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమోదం తదితర ప్రక్రియలు జరుగుతాయి.
 • 7న డీఈఓ/ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టులు, ప్రమోషన్ల సీనియారిటీ లిస్టులు ప్రకటిస్తారు.
 • 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన చేసి.. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారు.
 • 11,12 తేదీల్లో ఫైనల్ సీనియారిటీ లిస్టు.. హెడ్మాస్టర్ల బదిలీలకు వెబ్ఆప్షన్ల నమోదు ఉంటుంది.
 • 13న మల్టీజోనల్ స్థాయిలో హెడ్మాస్టర్ల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునర్ పరిశీలన ఉంటుంది.
 • 14న హెడ్మాస్టర్ల బదిలీ ఉత్తర్వులను ఆర్జేడీలు ఇస్తారు.
 • 15న బదిలీల తర్వాత మిగిలిన ఖాళీల ప్రకటన.
 • 16, 17, 18వ తేదీల్లో అర్హత గలిగిన స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ స్కూల్స్ హెడ్మాస్టర్ల ప్రమోషన్ల కౌన్సెలింగ్.
 • 19, 20వ తేదీల్లో సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల ప్రకటన, బదిలీల ఆప్షన్స్ నమోదు.
 • 21న ఆప్షన్ల సవరణ, పునర్ పరిశీలనకు అవకాశం.
 • 22, 23వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ఉత్తర్వులివ్వనున్న డీఈఓలు.
 • 24న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల తర్వాత ఏర్పడిన ఖాళీల ప్రకటన.
 • 25, 26, 27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ టీచర్లకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు.
 • 28, మార్చి1, 2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్ ఆప్షన్స్ నమోదు.
 • మార్చి3న ఆప్షన్ల సవరణ, పునర్ పరిశీలన.
 • 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ టీచర్లకు బదిలీ ఆర్డర్లు.
 • 5 నుంచి 19 వరకు డీఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీల్స్/ అభ్యంతరాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​కు పంపాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.