రాష్ట్రంలో మరో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో మరో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో ఖాళీ అయిన మున్సిపాలిటీ ఎన్నికలకు  నగరా మోగింది. వరంగల్, ఖమ్మం  కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట  మున్సిపాలిటీలకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఈసీ.  ఎన్నికలకు సంబంధించి రేపటి(శుక్రవారం) నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 20న స్క్రూటినీ జరగనుంది. 22వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉండగా...30 న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 3 న ఫలితాలు ప్రకటించేందుకు నిర్ణయించారు అధికారులు. కరోనా కేసులు పెరుగుతున్నందున...నామినేషన్ల కోసం రెండు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీ రిజర్వేషన్ల ఖరారయ్యాయి. లక్కీ డ్రాలో రిజర్వేషన్లను ఖరారు చేశారు CDMA అధికారులు. జడ్చర్ల బీసీ మహిళకు దక్కగా, కొత్తూరు స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. నకిరేకల్ మున్సిపాటిలీ బీసీ జనరల్ గా నిర్ణయించారు అధికారులు. చైర్ పర్సన్ ల రిజర్వేషన్ల కోసం లాటరీ నిర్వహించారు అధికారులు. వివిధ పార్టీలకు చెందిన నేతల సమక్షంలో లాటరీ తీశారు.

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారు జిల్లాల అధికారులు. వరంగల్ నగరంలోని 66 డివిజన్లకు రిజర్వేషన్లు ప్రకటించగా...65 డివిజన్ ఎస్టీ మహిళకు, 2వ డివిజన్ ఎస్టీ జనరల్ కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజ న్లు ఎస్సీ మహిళలకు, 15, 17, 18, 37, 47, 53 డివిజన్లను ఎస్సీ జనరల్ కు కేటాయించారు. 9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజన్ల ను బీసీ మహిళలకు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజన్లు బీసీ జనరల్ కు కేటాయించారు. 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63 డివిజన్లను జనరల్ మహిళల కు కేటాయించారు.
 ...