హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచే అడ్మిషన్ అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1 నుంచే ఆన్ లైన్ ద్వారా క్లాసులు ప్రారంభించాలని ఆయన సూచించారు. అడ్మిషన్ల అప్లీకేషన్లు స్వీకరణకు జులై 5 చివరి తేది అని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీలు ప్రస్తుతానికి ఆన్ లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రత్యక్ష (డైరెక్టు) క్లాసులు ఎప్పుడు ప్రారంభించాలనేది తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
