బన్నీ’అల.. వైకుంఠపురంలో’ టీజర్ రిలీజ్

బన్నీ’అల.. వైకుంఠపురంలో’ టీజర్ రిలీజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా అల.. వైకుంఠపురములో సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్టు దాచాడు నిన్న అనే వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. మీరు ఇప్పుడే కారు దిగారు.. నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా అని చెప్పడం ఆకట్టుకుంది. చివరల్లో సంక్రాంతి పుంజుని పట్టుకొని మాస్ లుక్ లో కనిపించాడు బన్నీ.

అల.. వైకుంఠపురంలో సినిమా వచ్చే  ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా…టబు, సుశాంత్, నివేదపేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.