సుంకేసుల జలాశయం నుంచి నీటి విడుదల : జేఈ రాజు

సుంకేసుల జలాశయం నుంచి నీటి విడుదల : జేఈ రాజు

అయిజ, వెలుగు: గద్వాల జిల్లా రాజోలి సమీపంలోని సుంకేసుల జలాశయం నుంచి ఆదివారం 546 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు డ్యామ్ జేఈ రాజు తెలిపారు. కర్నాటకలో కురుస్తున్న వర్షాల వల్ల సుంకేసుల జలాశయానికి 546 టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతోంది.

డ్యాం లో 1.235 టీఎంసీల నీటి నిల్వ ఉంచుకొని వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఒక గేటు ఎత్తి 290 క్యూసెక్కులు, కేసీ కెనాల్​కు 256 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.