ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల

ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల

కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది.  ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 21వ చిత్రం.  ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాక్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెటప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించాడు. అగ్ని జ్వాలల తన పిడికిలిని చూపించడాన్ని బట్టి అతని క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. 

‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. సోహెల్ ఖాన్, సయి మంజ్రేకర్,  శ్రీకాంత్ ఇతర  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షూటింగ్ జరుగుతోంది.  శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే, అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. .