బర్త్ డే సందర్భంగా నా డెత్ డే సాంగ్ రిలీజ్ చేస్తున్నా : ఆర్జీవీ

బర్త్ డే సందర్భంగా నా డెత్ డే సాంగ్ రిలీజ్ చేస్తున్నా : ఆర్జీవీ

వివాదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన పుట్టిన రోజు సందర్భంగా తన డెత్ డే సాంగ్ అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. యూట్యూబ్ లింక్ ను షేర్ చేశారు. ఫ్యాన్స్ రూపొందించిన ఈ పాటను మళ్లీ ఆ అభిమానులతో పంచుకుని, తన బర్త్ డేను వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ తో పాటు పలు సోషల్ మీడియా సైట్లలోనూ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ పాటకు రియాక్టవుతూ, పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.  ఈ పాటలోని లిరిక్స్ మీ క్యారెక్టర్ కు బాగా మ్యాచ్ అయ్యాయంటూ రిప్లై ఇస్తున్నారు.

అంతకుముందు ఏప్రిల్ 6వ తేదీన తన బర్త్ డే ఏప్రిల్ 7వ తేదీన అని, ఎవరూ విషెస్ చెప్పకండంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. విషెస్ దేనికీ ఉచితమైనవి, పనికి రావని వ్యాఖ్యానించారు. తాను చౌకైన బహుమతులతో సరిపెట్టుకుంటానన్న ఆయన.. ఉచితం కంటే చౌక ఉత్తమమని తమ అభిప్రాయమని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

https://twitter.com/RGVzoomin/status/1644239651136507904