రిలయన్స్ రిటైల్ వెంచర్స్ దూకుడు

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ దూకుడు

అర్బన్ ల్యాడర్ లో 96 శాతం వాటా కొనుగోలు.. మిగిలిన మొత్తం కూడా కొనేస్తున్నట్లు ప్రకటన

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ టేకోవర్లలో దూకుడు గా వ్యవహరిస్తోంది. డెకరేషన్.. హోం ఫర్నీచర్ ఉత్పత్తుల ను తయారు చేసి అమ్మే అర్బన్ ల్యాడర్ కంపెనీని అమాంతం కొనేసింది. ఏకంగా 96 శాతం వాటా అంటే రూ.182.15 కోట్లకు కొనుగోలు చేసింది. మిగిలిన వాటాను కూడా కొనేందుకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ హక్కులు కలిగి ఉంది. ఈ టేకోవర్ కు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అంటోంది.  వచ్చే ఏడాది ఆరంభంలోగా అర్బన్ ల్యాడర్ లో మరో 75 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం పరిశీలిస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ స్పష్టం చేసింది. అర్బన్ ల్యాడర్ కంపెనీ గత మార్చి నాటికి 457 కోట్ల టర్నోవర్ తో .. రూ.49.41 కోట్ల ఆదాయం సంపాదించిన  విషయం తెలిసిందే.