బ్యాటరీల తయారీకి రిలయన్స్‌కు ఇన్సెంటివ్స్​

బ్యాటరీల తయారీకి రిలయన్స్‌కు ఇన్సెంటివ్స్​

న్యూఢిల్లీ: ఈవీ బ్యాటరీ ఉత్పత్తికి మద్దతు ఇచ్చే ప్రోత్సాహకాల కార్యక్రమం కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ కేంద్రం నుంచి బిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రొడక్షన్​ లింక్​డ్​ ఇన్సెంటివ్ (పీఎల్​ఐ) పథకం కింద అడ్వాన్స్​డ్​ కెమిస్ట్రీ సెల్స్ లేదా ఏసీసీల ఉత్పత్తి కోసం ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఏడు కంపెనీలు బిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సమర్పించగా రిలయన్స్​ విజేతగా నిలిచింది. 

రిలయన్స్ 10 గిగావాట్ల వరకు ఏసీసీలను తయారు చేయగలదని కంపెనీ  ప్రకటన తెలిపింది.    బ్యాటరీల స్థానిక ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం గరిష్టంగా  434.4 మిలియన్ డాలర్ల వ్యయంతో పీఎల్​ఐ పథకాన్ని తీసుకొచ్చింది.