ఎయిర్ టెల్ డబుల్ డేటా, జియో కొత్త ప్లాన్స్ గురించి తెలుసా?

ఎయిర్ టెల్ డబుల్ డేటా, జియో కొత్త ప్లాన్స్ గురించి తెలుసా?

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తమ ప్రీ పెయిడ్ ప్లాన్స్ కు కొన్ని అదనపు బెనిఫిట్స్ ను జత చేసి యూజర్లకు అందిస్తున్నాయి. జియో 4జీ వోచర్స్ వ్యాలిడిటీని పొడిగించగా.. ఎయిర్ టెల్ డేటా బెనిఫిట్ ను డబుల్ చేయడంతోపాటు కొన్ని సెలెక్టెడ్ ప్రీ పెయిడ్ ప్లాన్స్ టాక్ టైమ్ ను పెంచింది. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి తొలిసారి ఈ టెల్కోలు కొత్త ప్లాన్స్ తో ముందుకొచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే కస్టమర్స్ కు ఉపయోగపడేలా నయా ఆఫర్ ప్లాన్స్ ను తీసుకొచ్చాయి.

వొడాఫోన్, ఎయిర్ టెల్ డబుల్ డేటా బెనిఫిట్ ప్రకటించిన నేపథ్యంలో జియో కూడా డేటా ప్లాన్స్ లో మార్పు చేసింది. జియో రూ.151 టాప్ అప్ ప్లాన్ ఆఫర్ పై 30 జీబీ డేటా, రూ.201 ప్లాన్ లో 40 జీబీ డేటా, రూ.251 డేటా ప్లాన్ లో 50 జీబీ డేటాను ప్రకటించింది. అతి తక్కువ ధరల వోచర్లుగా రూ.11, రూ.21ని తీసుకొచ్చింది. మరోవైపు ఎయిర్ టెల్ టాప్ అప్ ల డేటా బెనిఫిట్స్ ను పెంచింది. రూ.98తో ఉన్న ప్లాన్ కు 6జీబీ డేటా ఉండగా దాన్ని 12 జీబీకి పెంచింది. దాని వ్యాలిడిటీని (28 రోజులు) మాత్రం మార్చలేదు. అలాగే మరికొన్ని ప్లాన్స్ పై ధరలను తగ్గించింది.