
న్యూఢిల్లీ: టెలికం డిపార్ట్మెంట్కు స్పెక్ట్రమ్ ఫీజును గడువు కంటే ముందే చెల్లించేసినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. మార్చి 2021 ముందు ఆక్షన్స్‌లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు ఈ కంపెనీ రూ. 30,791 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కట్టేసినట్లు జియో బుధవారం వెల్లడించింది. 2014, 2015, 2016, 2021 సంవత్సరాలలో ప్రభుత్వం నిర్వహించిన ఆక్షన్స్‌లో స్పెక్ట్రమ్‌ను కంపెనీ కొనుగోలు చేసింది. రిలయన్స్ జియో అన్ని ఆక్షన్స్లోనూ కలిపి 585.3 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్‌ను కొంది. ముందుగానే స్పెక్ట్రమ్ ఫీజు చెల్లించేయడం వల్ల ఏటా రూ. 1,200 కోట్లు వడ్డీ రూపంలో ఆదా అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ స్పెక్ట్రమ్ ఫీజు చెల్లించడానికి టెలికం కంపెనీలకు ప్రభుత్వం నాలుగేళ్ల మారిటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని టెలికం కంపెనీలకు ఊరట కలిగించడానికి సెప్టెంబర్ 2021లో ఒక ప్యాకేజ్‌ను ప్రభుత్వం తెచ్చింది. 2016లో కొన్న స్పెక్ట్రమ్‌కి గాను మొదటి దశ ప్రీ పేమెంట్‌ను రిలయన్స్ జియో అక్టోబర్2021లో యానివర్సరీ సందర్భంగా జరిపింది. ఆ తర్వాత డిసెంబర్2021లో టెలికం డిపార్ట్మెంట్ దేశంలోని టెలికం కంపెనీలకు మరింత వెసులుబాటు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రీ పేమెంట్‌ను ఏ రోజైనా చెల్లించొచ్చని అప్పుడు టెలికం డిపార్ట్మెంట్ తెలిపింది. దీంతో రిలయన్స్ జియో తాను చెల్లించాల్సిన మొత్తం స్పెక్ట్రమ్ ఫీజును ముందస్తుగానే జనవరి 2022లో చెల్లించేసింది. నిజానికి ఈ స్పెక్ట్రమ్ ఫీజును 2022–23 నుంచి 2034–35 మధ్యలో ఎప్పుడయినా ఇన్స్టాల్మెంట్లలో చెల్లించే వెసులుబాటు రిలయన్స్ జియోకి ఉంది. కాకపోతే అలా చెల్లిస్తే 9.3 శాతం నుంచి 10 శాతం దాకా వడ్డీ ఖర్చును కంపెనీ భరించాల్సి వస్తుంది. కిందటి నెలలో భారతి ఎయిర్టెల్ కూడా టెలికం డిపార్ట్మెంట్కు రూ. 15,519 కోట్లను స్పెక్ట్రమ్ ఫీజు కింద చెల్లించేసింది. 2014 ఆక్షన్‌లో కొన్న స్పెక్ట్రమ్‌కు గాను ఈ చెల్లింపును భారతి ఎయిర్టెల్ జరిపింది. అప్పులలో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా, టాటా టెలి సర్వీసెస్(టీటీఎస్‌ఎల్) , టాటా టెలి మహారాష్ట్ర (టీటీఎంఎల్) లు మాత్రం నాలుగేళ్ల మారటోరియంను కోరుకున్నాయి. అంతేకాదు, చెల్లించాల్సిన మొత్తంపై వడ్డీ కింద ప్రభుత్వానికి తమ కంపెనీలలో వాటా ఇవ్వడానికీ ఒప్పుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి వీలో 35.8 % వాటా, టీటీఎస్‌ఎల్, టీటీఎంఎల్ కంపెనీలు రెండింటిలో 9.5 % వాటా చొప్పున దక్కాయి.
రిలయన్స్ రిటెయిల్ చేతికి యాడ్వెర్బ్ టెక్నాలజీస్
రోబోటిక్స్ కంపెనీ యాడ్వెర్బ్ టెక్నాలజీస్‌లో 55 శాతం వాటాను రిలయన్స్ రిటెయిల్ చేజిక్కించుకుంది. ఇందుకోసం రిలయన్స్ రిటెయిల్ రూ. 983 కోట్లను వెచ్చించింది. జియో–మార్ట్ గ్రోసరీ బిజినెస్ కోసం ఇప్పటికే రిలయన్స్‌తో కలిసి పనిచేస్తున్నామని, ఆ కంపెనీ వేర్‌హౌస్‌ల ఆటోమేషన్ కోసం సేవలు అందిస్తున్నామని యాడ్వెర్బ్ సీఈఓ సంగీత్ కుమార్ వెల్లడించారు. ఇలా కలిసి పనిచేయడంతో ఒకరిపై మరొకరికి నమ్మకం కుదిరిందని, అదే తాజా డీల్‌కు దారి తీసిందని పేర్కొన్నారు.
- ఇప్పుడు ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బాండ్ కింగ్ జియో
- బీఎస్ఎన్ఎల్ను వెనక్కి నెట్టేసింది
ఆపరేషన్స్ మొదలెట్టిన రెండేళ్లలోనే ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రిలయన్స్ జియో మార్కెట్ లీడర్‌గా మారింది. గత 20 ఏళ్లుగా మొదటి ప్లేస్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్ను రిలయన్స్ జియో వెనక్కి నెట్టేసింది. ట్రాయ్ విడుదల చేసిన సబ్స్క్రయిబర్ డేటా ఈ విషయం వెల్లడించింది. జియోకు ప్రస్తుతం 43.4 లక్షల మంది కస్టమర్లున్నట్లు ట్రాయ్ డేటా పేర్కొంది. అక్టోబర్2021లో 41.6 లక్షలుగా ఉన్న జియో కస్టమర్ల సంఖ్య నవంబర్ 2021 నాటికి 43.4 లక్షలకు చేరిందని వివరించింది. బీఎస్ఎన్ఎల్కు అక్టోబర్2021లో 47.2 లక్షల మంది కస్టమర్లుండగా, అదే ఏడాది నవంబర్ నాటికి ఆ కస్టమర్ల సంఖ్య 42 లక్షలకు పడిపోయింది. ఇక 40.8 లక్షల మంది సబ్స్క్రయిబర్లతో భారతి ఎయిర్టెల్ మూడో ప్లేస్‌లో నిలిచినట్లు ట్రాయ్ డేటా తెలిపింది. జియో తన ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జియో ఫైబర్ పేరుతో సెప్టెంబర్ 2019లోనే మొదలెట్టింది. అప్పటి నుంచీ జియో ఒక్కో కస్టమర్నూ పెంచుకోగా, మరోవైపు అప్పటికే 86.9 లక్షల మంది బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లున్న బీఎస్ఎన్ఎల్ నవంబర్ 2021 నాటికి వారిలో సగానికి పైగా కస్టమర్లను పోగొట్టుకోవడం గమనించొచ్చు. ఇదే కాలానికి భారతి ఎయిర్టెల్ కూడా 70 శాతం గ్రోత్‌ను సాధించింది. అంటే బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఓవైపు జియో, మరోవైపు భారతి ఎయిర్‌టెల్‌లు లాగేసుకున్నాయన్నమాట. దేశంలోని బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య నవంబర్ 2021 నాటికి 80.16 కోట్లకు చేరిందని, ఇందులో 43.29 కోట్ల మందితో రిలయన్స్ జియో టాప్‌లో ఉందని కూడా ట్రాయ్ తాజా డేటా వెల్లడించింది. భారతి ఎయిర్‌టెల్‌కు 21.1 కోట్లు, వీ కి 12.24 కోట్లు, బీఎస్ఎన్ఎల్కు 2.36 కోట్ల కస్టమర్లున్నట్లు పేర్కొంది.