DUDE Twitter Review: ‘డ్యూడ్’ X రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్ కొట్టేశాడా..? ఆడియన్స్ ఏమంటున్నారు?

DUDE Twitter Review: ‘డ్యూడ్’ X రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్ కొట్టేశాడా..? ఆడియన్స్ ఏమంటున్నారు?

‘లవ్ టుడే’ చిత్రంతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. రీసెంట్‌‌గా ‘డ్రాగన్’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘డ్యూడ్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు ప్రదీప్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్.. నేడు (అక్టోబర్ 17న) వరల్డ్ వైడ్గా గ్రాండ్గా విడుదలైంది.

ఈ మూవీతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘ప్రేమలు’ ఫేమ్  మమిత బైజు హీరోయిన్‌‌గా నటించగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే, అమెరికాలో ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్తో యూత్ని ఆకట్టుకున్న.. ‘డ్యూడ్’ రిలీజయ్యాక ఎలా అనిపిస్తుంది? సినిమా చూసిన ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రదీప్ మాస్, క్లాస్, రొమాన్స్ యూత్ని ఎలా మెస్మరైజ్ చేసిందో X లో తెలుసుకుందాం.  

‘‘ డ్యూడ్ ఫస్ట్ హాఫ్ సరదాగా ఎమోషన్, ట్విస్ట్‌లతో సాగింది. ప్రదీప్ మళ్లీ అద్భుతంగా తిరిగి వచ్చాడు. సినిమా చాలా నచ్చింది. ఈ దీపావళి డ్యూడ్‌దే. క్రేజీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభంయక్కర్.. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమాని బాగా ఎలివేట్ చేసంది. డైరెక్టర్ కీర్తిశ్వరన్ స్టోరీని చాలా బాగా డీల్ చేశారు’’  అని ఓ నెటిజన్ తన రివ్యూ షేర్ చేశాడు.

‘‘ డ్యూడ్ ఒక మిడ్ రొమాంటిక్ కామెడీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ యావరేజ్గా సాగింది. క్రేజీ రొమాంటిక్ కామెడీ. ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా ప్రారంభమవుతుంది కానీ ప్రీ-ఇంటర్వెల్లో సినిమా పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్‌ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచింది. అయితే, సెకండ్ హాఫ్, స్టార్టింగ్ బాగున్నప్పటికీ.. ఫ్లాట్ ఇంకా బలంగా ఉండాల్సింది. 

దర్శకుడు కీర్తిశ్వరన్ తన డైరెక్షన్లో క్రేజీ మార్క్ చూపించాడు. కానీ స్క్రీన్‌ప్లేలో తడబడ్డాడు. ముఖ్యంగా సెకండాఫ్లో ప్రదీప్ మరియు మమిత నటన కథకు ప్రాణం పోశారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి ఆభ్యంకార్ ఎంట్రీ బాగుంది. తన బీట్స్తో సీన్స్ని బాగా ఎలివేట్ చేశాడు. అయితే, సినిమాలో బలమైన ఎమోషన్ ఉంటే బాగుండు. డ్యూడ్ ఫ్రెష్ ఫీలింగ్తో చూసేయొచ్చు..’’ అని మరో నెటిజన్ తన రివ్యూ షేర్ చేశారు.