ఎంత ఇన్ఫోసిస్ వాళ్లైతే మాత్రం.. వాళ్లకు అన్నీ తెలుసా.?: సీఎం సిద్ధరామయ్య

ఎంత ఇన్ఫోసిస్ వాళ్లైతే మాత్రం.. వాళ్లకు అన్నీ తెలుసా.?: సీఎం సిద్ధరామయ్య

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి , ఆయన భార్య రచయిత్రి సుధా మూర్తి కర్ణాటకలో కొనసాగుతోన్న  సామాజిక ,విద్యా  కులగణన సర్వేలో పొల్గొనకపోవడంపై  సీఎం సిద్ధరామయ్య  తీవ్రంగా స్పందించారు , ఈ సర్వే  వెనుకబడిన తరగతుల సర్వే కాదని, మొత్తం జనాభా గణన అని స్పష్టం చేశారు.తాము చేపట్టిన సర్వే  రాష్ట్ర, జాతీయ  ప్రయోజనాల కోసమేనన్నారు. 

అసలేం జరిగిందంటే..? కర్ణాటకలో సామాజిక ,విద్యా  కులగణన సర్వే జరుగుతోంది. అయితే ఈ సర్వేలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు తేల్చి చెప్పారు. ఇది వెనుకబడిన వర్గాల వారికి చెందిన సర్వే అని  అన్నారు. తాము ఎలాంటి వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్లం కాదు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో అందుకే పాల్గొనట్లేదని వ్యాఖ్యానించారు. 

ఈ క్రమంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలకు లేటెస్ట్ గా  సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు.  ప్రభుత్వ సర్వేలో పాల్గొనకపోవడం కరెక్ట్ కాదన్నారు. అది వారికే విజ్ఞతకే  వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదు.. వాళ్లు అర్థం చేసుకోకపోతే  తానేమి  చేయలేనన్నారు.  వాళ్లు  ఇన్ఫోసిస్  అయినంత మాత్రానా వాళ్లకు అన్నీ తెలిసి పోతాయా అని ప్రశ్నించారు సిద్ధరామయ్య.   ఇది వెనుకబడిన తరగతుల సర్వే కాదు.. ఇది మొత్తం జనాభా సర్వే అని తాము ఇప్పటికే  20 సార్లు చెప్పాము అని -  అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సర్వే చేస్తుంది కదా..దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నినంచారు సిద్ధరామయ్య. తాము చేస్తున్న సర్వేపై వాళ్ల దగ్గర తప్పుడు సమాచారం ఉండొచ్చు అని సిద్ధరామయ్య  అన్నారు.