Salman Agha: ఇండియాతో హ్యాట్రిక్ ఓటములు.. పాకిస్థాన్ టీ20 కెప్టెన్సీ నుంచి సల్మాన్ ఔట్.. కొత్త సారధి ఎవరంటే..?

Salman Agha: ఇండియాతో హ్యాట్రిక్ ఓటములు.. పాకిస్థాన్ టీ20 కెప్టెన్సీ నుంచి సల్మాన్ ఔట్.. కొత్త సారధి ఎవరంటే..?

ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ ను ఫైనల్ వరకు తీసుకొచ్చినా కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. టీమిండియాపై వరుస పరాజయాలు సల్మాన్ కెప్టెన్సీని ప్రమాదంలో పడేశాయి. 8 జట్లు తలపడిన ఈ టోర్నీలో పాకిస్థాన్ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడినా టీమిండియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ నాలుగు మ్యాచ్ ల్లో గెలిస్తే మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓడిపోయిన మూడు మ్యాచ్ లు ఇండియా చేతిలోనే కావడం ఆ జట్టును తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. లీగ్ దశలో.. సూపర్-4లో ఘోరంగా ఓడిన పాక్ జట్టు ఫైనల్స్ లో మాత్రం పోటీనిచ్చింది.

ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చేసింది 146 పరుగులే అయినా చివరి వరకు పోరాడింది. అయితే తిలక్ వర్మను ఆపడంలో పాక్ విఫలమైన పాక్ టైటిల్ దగ్గరకు వచ్చి ఓడిపోయింది. టోర్నీలో ఒక జట్టుతో మూడు మ్యాచ్ లు ఓడిపోవడం ఏ జట్టుకైనా బాధ. పైగా భారత జట్టుతో మ్యాచ్ కు ముందు కాలు దువ్విన పాకిస్థాన్ కు ఈ ఓటములు కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించనున్నట్టు సమాచారం. 

సల్మాన్ ను కెప్టెన్ నుంచి ఖాయమని త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు పాకిస్థాన్  మీడియా చెప్పుకొస్తుంది. కెప్టెన్ గానే కాకుండా బ్యాటింగ్ లోనూ అఘా ఘోరంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్‌ల్లో 80.90 స్ట్రైక్ రేట్‌తో కేవలం 72 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సల్మాన్ అలీ అఘా స్థానంలో ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించనుంది. ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని పాకిస్థాన్ క్రికెట్ ఈ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న షాదాబ్ త్వరలో పాక్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

షాదాబ్ 112 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్ లు ఆడుతూ జట్లకు కెప్టెన్ గ పని చేశాడు. లెగ్ స్పిన్ వేయడంతో పాటు లోయర్-ఆర్డర్ లో పరుగులు చేయగలడు. ఇటీవలే జరిగిన ఆసియా కప్ లి ఈ పాక్ ఆల్ రౌండర్ భుజం గాయం కారణంగా టోర్నమెంట్ కు దూరమయ్యాడు.