జియోమార్ట్​లో ఉద్యోగులకు తప్పని తిప్పలు

జియోమార్ట్​లో ఉద్యోగులకు తప్పని తిప్పలు

న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్​​కు చెందిన ఆన్​లైన్​ గ్రాసరీ జియోమార్ట్ వెయ్యి మంది ఉద్యోగులను తీసేసింది. రాబోయే రోజుల్లో మరో తొమ్మిది వేల మందిని ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి.  అంబానీ కుటుంబానికి  చెందిన ఈ సంస్థ మరో రిటైలర్​  మెట్రో క్యాష్ అండ్ క్యారీని దక్కించుకుంది. ఇక నుంచి జియోమార్ట్​ ఈ సంస్థతో కలసి పనిచేస్తుంది. దీంతో  కొందరు ఉద్యోగులను తీసేయాల్సి వచ్చింది. ఈ రౌండ్ లేఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ విభాగంలో ఉన్నాయి.  రాబోయే రోజుల్లో, ఇతర విభాగాలలో పనిచేసే వారికి కూడా పింక్ స్లిప్​లు రావొచ్చని నేషనల్​ మీడియా తెలిపింది.

హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ విభాగంలో దాదాపు మూడింట రెండు వంతుల మంది తీసేయాలని రిలయన్స్​ భావిస్తోందని పేర్కొంది.  గత కొన్ని రోజులుగా కంపెనీ తన కార్పొరేట్ కార్యాలయంలోని 500 మంది ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోపాటు మరో ఐదు వందల మందిని రాజీనామా చేయాలని కోరింది.  మెట్రో క్యాష్ అండ్ క్యారీని కొనుగోలు చేయడంతో అందులోని దాదాపు 3,500 మంది  వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలయన్స్​ కిందికి వచ్చింది. దీంతో కొందరు ఉద్యోగులను తీసేస్తారనే అంచనాలు ఏర్పడ్డాయి.