రూ.5000 కే రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్ 

రూ.5000 కే రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్ 

జియో, గూగుల్ భాగస్వామ్యంలో  సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా  అతి తక్కువ ధరతో స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ మార్కెట్ లోకి రానుంది. ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. ఇందులో హెచ్‌డీ డిస్‌ప్లే, 4GB జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర గతంలోనే ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ జియోఫోన్ నెక్స్ట్ ధర రూ.3,499గా ఉండనుంది. ఇందులో రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ ధర రూ.5,000గానూ, హైఎండ్ వేరియంట్ ధర రూ.7,000గా ఉండనుంది. వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ జరగనుంది.


జియో మెబైల్ ను సొంతం చేసుకోవాలంటే..రూ.5వేల ఫోన్‌ ధరపై రూ.500, రూ.7వేల ఫోన్‌ ధరపై రూ.700 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని EMI రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 


ఈ ఫోన్ లో 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. 4జీ వోల్టే, డ్యూయల్ సిం సపోర్ట్ కూడా ఇందులో ఉండనున్నాయి. తక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లు ప్రభావవంతంగా పనిచేయడానికి డ్యుయోగో అనే ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో గూగుల్ కెమెరా గో అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 5.5 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1,440 పిక్సెల్స్ గా ఉండనుంది. ఇందులో క్వాల్‌కాం క్యూఎం 215 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 64 బిట్ క్వాడ్‌కోర్ మొబైల్ ప్రాసెసర్. ఇందులో వెనక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 2500 MAHగా ఉండే అవకాశం ఉంది. బ్లూటూత్ వీ 4.2, GPS, 1080పీ వీడియో రికార్డింగ్, LPDDR 3 ర్యామ్, EMMC 4.5 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.