స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన రిలయన్స్‌.. ఒక్కరోజే 12 శాతం జంప్‌

స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన రిలయన్స్‌.. ఒక్కరోజే 12 శాతం జంప్‌

ముంబై: భారత స్టాక్ మార్కెట్లలో సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ వన్‌‌‌‌సైడ్ షో కనిపించింది. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్ బాగుండడంతో ఈ ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు ఏకంగా 12 శాతం దూసుకెళ్లాయి. దీంతో సెన్సెక్స్ 1,233 లాభపడింది. ఈ  లాభంలో 762 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్ల లాభంలో 198 పాయింట్లు రిలయన్స్ పెరగడం వల్లనే వచ్చాయి. మొత్తంగా చూస్తే సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ వరుసగా మూడో రోజూ పెరిగాయి. 
 
అంతర్జాతీయంగా అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, ఇరాన్ యుద్ధ చర్చల పురోగతితో బ్రెంట్ క్రూడ్ ధరలు చల్లబడటం, అక్టోబర్‌‌‌‌లో రికార్డు స్థాయిలో రూ.2.31 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం వంటి సానుకూల అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌‌‌ను మెరుగుపరిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం1,233.25 పాయింట్లు (1.66శాతం) పెరిగి 75,692.78 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 388 పాయింట్లు (1.68శాతం) ఎగిసి 23,440.80 వద్ద స్థిరపడింది.  

ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.6.94 లక్షల ఋఋ కోట్లు పెరిగింది. ప్రధాన సూచీలతో పోలిస్తే బ్రాడ్‌‌‌‌ మార్కెట్లలో లాభాలు కాస్త పరిమితంగా కనిపించాయి. నిఫ్టీ మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం లాభపడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌‌‌‌తో పోలిస్తే రూపాయి విలువ 94.90 వద్ద స్వల్ప లాభంతో ముగిసింది. 

రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, పీఎస్‌‌‌‌యూ బ్యాంకులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్‌‌‌‌ఫ్రా, ఆటో రంగాలు 1శాతం నుంచి 4.6శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు ఐటీ, మీడియా, ఫార్మా రంగాలు 0.5శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్‌‌‌‌లో  రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల బాట పట్టాయి. 

అక్టోబర్ అమ్మకాలు బాగుండటంతో మారుతి సుజుకి, హ్యుందాయ్, ఫోర్స్ మోటార్స్ షేర్లు 1–-4 శాతం పెరిగాయి. బొగ్గు సరఫరా రికార్డు స్థాయికి చేరడంతో కోల్ ఇండియా 4 శాతం, మెరుగైన ఫలితాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా 3శాతం పెరిగాయి. మరోవైపు ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ లైఫ్, గ్రాన్యూల్స్ ఇండియా షేర్లు నష్టాలతో ముగిశాయి.

రికార్డ్‌‌‌‌ ర్యాలీ..

సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయిలో లాభాలు ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ బ్రోకరేజీల పాజిటివ్ రేటింగ్‌‌‌‌లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఏకంగా 12 శాతం ఎగబాకింది. ఏప్రిల్ 2020 తర్వాత ఒకే రోజులో రిలయన్స్‌‌‌‌కు ఇదే అతిపెద్ద పెరుగుదల కావడం విశేషం. ఈ అద్భుత ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.17 లక్షల కోట్ల మార్కును దాటేసింది. 

టెక్నికల్ ఎనలిస్టుల ప్రకారం నిఫ్టీ రోజువారీ చార్టుల్లో బుల్లిష్ క్యాండిల్‌‌‌‌ను ఏర్పరిచింది. ఆగస్టు 25 తర్వాత తొలిసారి నిఫ్టీ తన 50 రోజుల ఈఎమ్‌‌‌‌ఏ పైన ముగియడంతో మార్కెట్ మూమెంటమ్ బలంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీకి 23,250 – 23,300 స్థాయిలు కీలకమైన సపోర్ట్‌‌‌‌గా  పనిచేస్తాయని, ఎగువన 23,500 – 23,650 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ ఉంటుందని ఎనలిస్టులు తెలిపారు. 

ఒకవేళ నిఫ్టీ 23,600 స్థాయిని అధిగమిస్తే ర్యాలీ 23,750 వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే 23,200 కంటే దిగువకు జారితే ట్రెండ్ బలహీనపడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ సోమవారం 0.58శాతం పెరిగినప్పటికీ కన్సాలిడేషన్ దశలోనే ఉంది. దీనికి 54,400–54,500 కీలక సపోర్ట్ కాగా, 55,500–55,600 స్థాయిలు కీలక నిరోధంగా మారనున్నాయి.