రిలయన్స్​చేతికి ఎలిఫెంట్​హౌజ్​

రిలయన్స్​చేతికి ఎలిఫెంట్​హౌజ్​

న్యూఢిల్లీ:  రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్​సీపీఎల్) మనదేశం అంతటా ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్   డ్రింక్స్​ తయారీ, మార్కెట్, పంపిణీ, అమ్మడానికి కోసం శ్రీలంక కేంద్రంగా పనిచేసే ఎలిఫెంట్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది వరకే  ఆర్​సీపీఎల్ చేతిలో కాంపా, సాస్యో, రస్క్రిక్​ వంటి బ్రాండ్లు ఉన్నాయి.   శ్రీలంకలోనే  అతిపెద్ద లిస్టెడ్ సంస్థ జాన్ కీల్స్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థ సిలోన్ కోల్డ్ స్టోర్స్ యాజమాన్యంలో ఎలిఫెంట్ హౌస్ ఉంది.  ఇది నెక్టో, క్రీమ్ సోడా, ఈజీబీ జింజర్ బీర్, ఆరెంజ్ బార్లీ  లెమనేడ్ వంటి అనేక రకాల పానీయాలను తయారు చేసి అమ్ముతుంది.