
న్యూఢిల్లీ: ఫండ్స్‌ను తక్కువ వడ్డీకే సేకరించినందుకు 2023 కి గాను ఆసియా ‘ఇష్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇంటర్నేషనల్ ఫైనాన్షింగ్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) ఇచ్చింది. ఈ అవార్డును నాలుగుసార్లు గెలుచుకున్న ఏకైక ఆసియా కంపెనీ రిలయన్స్ మాత్రమే. 2006, 2015, 2018, 2023 కు గాను ఈ అవార్డును కంపెనీ దక్కించుకుంది. ఈ కంపెనీ 2023 లో 7.5 బిలియన్ డాలర్ల విలువైన సిండికేటెడ్ లోన్లను సాధించింది. 55 బ్యాంక్‌లతో కూడిన గ్రూప్ ఈ లోన్‌ను ఇచ్చాయి. 5 బిలియన్ డాలర్లను ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీల నుంచి, రూ.20 వేల కోట్లను రూపాయి బాండ్ల ఇష్యూ ద్వారా సేకరించింది.