హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వరదల కారణంగా ప్రభావితమైన వ్యక్తుల నామినీలు/లబ్దిదారుల కోసం క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేశామని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది.
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సహా ఇతర పాలసీల డబ్బును పొందడానికి చెక్ కాపీ, డెత్‌సర్టిఫికెట్, పాన్‌కార్డ్/ ఫారం 60, ఇటీవలి ఫోటో, ఆధార్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలి. మరింత సమాచారం కోసం నామినీలు/లబ్దిదారులు 1800-2660కి కాల్ చేయవచ్చని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.