
- పాక్, అఫ్గాన్, బంగ్లా నుంచి వచ్చిన మైనార్టీలకు వర్తింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిటిజన్‌షిప్ కటాఫ్ తేదీని పొడిగించింది. 2014 డిసెంబర్ 31 తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు కూడా సిటిజన్‌షిప్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ 3 దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం ఇస్తామని వెల్లడించింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముస్లిమేతర శరణార్థుల వద్ద పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేకపోయినా దేశంలో ఉండేందుకు అనుమతి ఇస్తున్నట్టు అందులో పేర్కొంది. ఒకవేళ డాక్యుమెంట్ల గడువు అయిపోయినా ఉండొచ్చని తెలిపింది. కాగా, సిటిజన్‌షిప్ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం పోయినేడాది అమల్లోకి తెచ్చింది.
దాని ప్రకారం.. 2014 డిసెంబరు 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ రూల్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.