ఢిల్లీ : పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
బ్రిటన్ పౌరసత్వం ఉన్న రాహుల్ గాంధీ… లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని హిందూ మహాసభ కార్యకర్త ఒకరు ఆరోపించారు. ఆయనన్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు బ్రిటన్, ఇటు ఇండియా… రెండు పౌరసత్వాలు కలిగి ఉండటంపై విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఐతే.. దీనిని సుప్రీంకోర్టు కొట్టేసింది.
