రాజకీయ ఈవెంట్లే కరోనా విజృంభణకు కారణాలు

రాజకీయ ఈవెంట్లే కరోనా విజృంభణకు కారణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభించడానికి కలిగిన కారణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) విశ్లేషించింది. మతపర, రాజకీయ కార్యక్రమాలతో భారత్ లో కరోనా వ్యాప్తి ఎక్కువైందని డబ్లూహెచ్ఓ తెలిపింది. ఇలాంటి ఈవెంట్లలో వేలాది మంది ఒకే దగ్గర గుమిగూడటం, సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి పెరిగిందని స్పష్టం చేసింది. ఒకరకంగా ఇది ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసినట్లేనని మండిపడింది. భారత్ లో కనుగొన్న B.1.617 కరోనా వేరియంట్ చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ రకం కరోనా గతేడాది అక్టోబర్ లో భారత్ లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. B.1.617 కరోనా వేరియంట్ లో పలు ముటేషన్ లు ఉన్నాయని, వాటిలో కొన్ని అతి ప్రమాదకరమని వివరించింది.