హైదరాబాద్, వెలుగు: ఫార్మా కంపెనీ రెమెడియం లైఫ్కేర్కు సెప్టెంబర్ క్వార్టర్లో రూ.8.62 కోట్ల లాభం వచ్చింది. ఇది గత త్రైమాసికం కంటే 85.49 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం 114.31 కోట్లకు చేరింది.
ఇబిటా 82.70 శాతం పెరిగి రూ.10.44 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగభాగంలో (హెచ్1) నికర లాభం రూ.13.27 కోట్లు కాగా, గత పూర్తి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన వృద్ధి కనిపించింది. మొత్తం ఆస్తుల విలువ రూ.1623.18 కోట్లకు చేరిందని రెమెడియం తెలిపింది.
