
ఫ్యామిలీ ఆడియెన్స్ఎంతో ఇష్టపడే చిరంజీవి(Chiranjeevi) సినిమాల్లో డాడీ కూడా ఒకటి. ఇందులో భార్యా పిల్లలకు దూరమైన తండ్రిగా మెగాస్టార్ తన నటనతో కట్టిపడేశారు. అయితే, ఈ సినిమాలో కూతురిగా చిరుకి దీటుగా నటించి ఆకట్టుకున్న చిన్నారి మీకు గుర్తుందా? ఆ పాప లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి.
తన పేరు అనుష్క మల్హోత్రా(Anushka Malhotra). ముంబైలో పుట్టింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉంటోంది. ఓ కంపెనీలో మార్కెటింగ్ స్ట్రాటెజిస్ట్‌గా కూడా పనిచేస్తోందట. చందమామ లాంటి అందం, నవ్వితో బుగ్గ మీద పడే చొట్ట, చిరంజీవితో కూతురిగా ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించాయి.. అక్కి, డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్.. అంటూ ముద్దుముద్దుగా పలికే ఆ చిన్నారి మాటలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.
డాడీ సినిమా తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా నటించలేదు. కానీ ఇప్పటికీ అనుష్కను తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేదు. ఇన్‌స్టాలో తన అకౌంట్‌ను ఎంతోమంది ఫాలో అవుతున్నారు. తన లేటెస్ట్ లుక్స్ చూసి నువ్వు హీరోయిన్గా చేయెచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుష్కకు మాత్రం యాక్టింగ్ వైపు అంతగా ఆసక్తి లేదని తెలుస్తోంది.