ప్రభుత్వం వద్దకు డాక్టర్ల తొలగింపు ఫైల్

ప్రభుత్వం వద్దకు డాక్టర్ల తొలగింపు ఫైల్

రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌ డాక్టర్ల తొలగింపు ఫైల్ ప్రభుత్వం వద్దకు చేరింది. తొలగింపుకు న్యాయ ప్రక్రియ అడ్డంరాకుండా ఒకట్రెండు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌ ఇవ్వనున్నారు. టీవీవీపీ పరిధిలోని దవాఖాన్లలో పనిచేస్తూ.. ఆబ్సెంట్ అవుతున్న 134 మంది స్పెషలిస్ట్‌‌‌‌ డాక్టర్లకు ఈ మధ్యే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వీరిలో 86 మంది నోటీసులకు స్పందించలేదు. దీంతో వారందరినీ తొలగించేందుకు టీవీవీపీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి, సాధారణ పరిపాలనశాఖ(జీఏడీ)కు పంపించారు. ఈ 86 మంది వివరాలతో జీఏడీ గెజిట్ విడుదల చేయనుంది. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల సమయం ఇచ్చి, స్పందించని డాక్టర్లను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని ఉన్నతాధికారులు వివరించారు.