తెలంగాణ వర్సిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ తొలగింపు

తెలంగాణ వర్సిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ తొలగింపు

నిజామాబాద్: తెలంగాణ వర్సిటీ ఇంచార్జ్ రిజిస్టార్ గా కనకయ్య ను తొలగించారు. ఈ తొలగింపునకు పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. కొత్త రిజిస్టార్ ను సీనియారిటీ ప్రకారం ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీనియారిటీ పరిశీలనలో నూతన రిజిస్ట్రార్ గా యాదగిరి పేరు తెరపైకి వచ్చింది. సీనియారిటీ ప్రకారం యాదగిరిని కొత్త రిజిస్ట్రార్ గా నియమించినట్లు సమాచారం.