రైతుల వైపే ఉంటే కేంద్ర మంత్రిని తొలగించండి

రైతుల వైపే ఉంటే కేంద్ర మంత్రిని తొలగించండి
  • ప్రధానికి ప్రియాంక గాంధీ లేఖ

లక్నో:  సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశం నిజంగా మంచిదే అయితే.. లక్నోలో జరిగే డీజీపీల మీటింగ్​లో కేంద్ర మంత్రి
అజయ్ మిశ్రాతో కలిసి వేదిక పంచుకోవద్దని కాంగ్రెస్​ లీడర్​ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ప్రధానికి లేఖ రాశారు.
లఖీంఫూర్​ఖేరీ కేసులో నిందితుడి తండ్రి అయిన కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాను పదవి నుంచి తొలగించాలన్నారు. లక్నోలో శనివారం ప్రారంభమైన
డీజీపీల కాన్ఫరెన్స్​కు ముందు ఆమె ప్రధానికి రాసిన లేఖను మీడియా ముందు చదివి వినిపించారు. ఇవాళ మీరు నిజంగా రైతుల వైపు నిలబడి ఉంటే
అతడిని పదవి నుంచి తొలగించాలని అన్నారు.