ఆంధ్రాలో రూ.22 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న రీన్యూ పవర్‌

ఆంధ్రాలో రూ.22 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న రీన్యూ పవర్‌

న్యూఢిల్లీ: గ్రీన్ ఎనర్జీ కంపెనీ రీన్యూ పవర్ ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో భారతదేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి రూ.22 వేల కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. అనంతపురంలో 1,800 మెగావాట్ సోలార్ ఎనర్జీ ప్లాంట్, 1,000 మెగావాట్ విండ్ ఫెసిలిటీ, 2 గిగావాట్ అవర్ (జీడబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌)ను రెండు ఫేజ్‌‌‌‌‌‌‌‌లలో నిర్మించనుందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.  అంతేకాకుండా, క్లీన్ ఎనర్జీని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేయడానికి 100 కిలోమీటర్ల ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా-హై వోల్టేజ్ (ఈవీహెచ్‌‌‌‌‌‌‌‌) లైన్‌‌‌‌‌‌‌‌ను కూడా నిర్మించనుంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు మే 16న శంకుస్థాపన జరగనుంది.

ఆంధ్రప్రదేశ్  ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కంపెనీ మొదటి ఫేజ్‌‌‌‌‌‌‌‌లో 587 మెగావాట్ సోలార్ ప్లాంట్, 250.8 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్, 415 మెగావాట్ అవర్ బీఈఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తుంది.  మిగిలిన కెపాసిటీని తర్వాతి ఫేజ్‌‌‌‌‌‌‌‌లలో అభివృద్ధి చేస్తుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రిన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ అవుతుంది.  కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో లాంచ్ చేసిన కొత్త ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.