వడ్యాల్ గ్రామంలో వైభవంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం

వడ్యాల్ గ్రామంలో  వైభవంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవం

లక్ష్మణచాంద, వెలుగు :లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. లక్ష్మణచాంద, మామడ మండలాల గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి మహోత్సవం నిర్వహిస్తారు. 

అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ఆలయ ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.  రేణుక ఎల్లమ్మ, పరుశరాముని వేషధారణలో భక్తులకు అమ్మవారి చరిత్రను వివరించారు.  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.