దెబ్బలు తట్టుకోలేకనే రేణుస్వామి మృతి

దెబ్బలు తట్టుకోలేకనే రేణుస్వామి మృతి
  •     పోస్ట్​మార్టం రిపోర్టులో వెల్లడి
  •     యాక్టర్ దర్శన్​ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

బెంగళూరు: రేణుస్వామి హత్యకేసులో అరెస్టయిన ప్రముఖ కన్నడ యాక్టర్ దర్శన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దర్శన్​తో పాటు అతడి అనుచరులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేకనే రేణుస్వామి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. రక్తస్రావం, షాక్ తో రేణుస్వామి చనిపోయాడని, అతడి బాడీపై 15 చోట్ల తీవ్రగాయాలున్నాయని పోస్ట్​మార్టం రిపోర్టులో వెల్లడైంది. 

దర్యాప్తులో భాగంగా స్పాట్​కు వెళ్లిన పోలీసులు రేణుస్వామి హత్యకు వాడిన కర్రలు, రాడ్లు, లెదర్ బెల్టు, షెడ్డులో ఉన్న ట్రక్కు సహా మద్యం బాటిళ్లు, అక్కడి సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, రేణుస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకెళ్లిన రవి అనే డ్రైవర్​ శుక్రవారం పోలీసులకు లొంగిపోయాడు. దర్శన్ సూచనల మేరకే రేణుస్వామిని కిడ్నాప్ చేసినట్లు వెల్లడించాడు.